ఈ ఏడాది టాలీవుడ్ అందుకున్న సాలిడ్ హిట్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది” కూడా ఒకటి. మంచి హైప్ నడుమ వచ్చి రికార్డు ఓపెనింగ్స్ అందుకొని 400 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది.
అంతే కాకుండా 30 రోజులు దాటిన తర్వాత కూడా పలు చోట్ల హౌస్ ఫుల్స్ ఈ సినిమాకి పడ్డాయి. ఇక ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని జూలై 9 నుంచి హిందీ మినహా మిగతా భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక్క క్లారిటీ ఓటిటి వెర్షన్ విషయంలో అభిమానులు కోరుకుంటున్నారు.
‘పెద్ది’ కొత్త వెర్షన్ ఉంటుందా లేక పాతదేనా?
థియేటర్స్ లో విడుదల చేసిన తర్వాత పెద్ది సినిమాపై కొన్ని అంశాల్లో వచ్చిన విమర్శలు తీసుకొని కొన్ని సీన్స్ తీసేసి మేకర్స్ కొత్త సీన్స్ యాడ్ చేశారు. అయితే ఈ వెర్షన్ ఉంటుందా లేక మొదట్లో వచ్చిందే వస్తుందా అనేది మేకర్స్ కానీ అటు నెట్ ఫ్లిక్స్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం కొంచెం ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ గా మారింది. సో దీనిపై వారు ఓ క్లారిటీ కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ గత సినిమాకి కూడా ఇదే పరిస్థితి
చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వెర్షన్ ని తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి కుదించేశారు. తీరా ఓటిటిలోకి వచ్చాక ఆ ముందు సీన్స్ ఏవి కూడా అందులో లేవు. సో పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా లేదా అనేది ఈ జూలై 9తో తేలిపోతుంది.


