పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. అక్టోబర్ 1న విడుదలవుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు.
పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో జంతువులను(యడ్లను) చూపించారు. అందువల్ల జంతు సంరక్షణ సమితి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు 3 కట్స్ విధించింది. కొన్ని డైలాగులను మ్యూట్ చేయమన్నారు. హీరోయిన్లపై చిత్రీకరించిన 4 రొమాంటిక్ సన్నివేశాలలో విజువల్స్ (10 సెకన్లలోపు) రీప్లేస్ చేయమని చెప్పారు. సెన్సార్ వారు చెప్పిన కట్స్, మిగిలిన వివరాలను పైన అందిస్తున్నాం.


