చరణ్ న్యూఇయర్ పార్టీని ఎక్కడ సెట్ చేశాడో తెలుసా..

Published on Dec 31, 2019 9:11 pm IST

హీరో రామ్ చరణ్ సినిమా పట్ల ఎంత శ్రద్ద చూపుతాడో కుటుంబం పట్ల కూడా అంతే శ్రద్దగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబానికి సరిపడా టైమ్ కేటాయించాలనేది ఆయన పాలసీ. అందుకే ముఖ్యమైన ప్రతి సంధర్భాన్నీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు చెర్రీ. బయటి పార్టీల్లో కంటే ఫ్యామిలీ వేడుకల్లోనే ఎక్కువ కనిపిస్తకనిపిస్తుంటాడు.

గత క్రిస్మస్ పండుగను ఉపాసనతో కలిసి సోదరి శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ లతో సెలబ్రేట్ చేసుకున్న అయన న్యూఇయర్ వేడుకల్ని కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. సన్నిహితులతో కలిసి గోవాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నాడు. ఈ ఫ్యాన్సీ పార్టీ కోసం ఈరోజు ఉదయమే గోవా బయలుదేరి వెళ్ళారు చరణ్. ఇకపోతే ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :