
శతాబ్ద కాలం లో మూడు తరాల మధ్య సాగే ప్రేమకథ ఆధారంగా అక్కినేని కుటుంబం తెరకెక్కించిన ‘మనం’ చిత్ర వరల్డ్ ప్రీమియర్ షో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పై తెలుగు చిత్ర పరిశ్రమ లోని ప్రతి ఒక్కరు కూడా తమ ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.
తాజాగా హీరో రామ్ చరణ్ కూడా మనం చిత్రాన్ని పొగిడే వారి లిస్టులో చేరిపోయారు. మనం చిత్రం ప్రేమనురాగాలతో కూడిన అన్ని భావాలు కలిగిన చిత్రమని తన మైక్రో బ్లాగ్గింగ్ పేజి లో చరణ్ పేర్కొన్నాడు. అఖిల్ నటన బాగుందని మెచ్చుకున్న చరణ్ , నాగార్జున మరియు అక్కినేని కుటుంబ సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా ను బాగా తెరకెక్కించారన్నారు.
గురువారం మనం ప్రీమియర్ షో చూసిన అనంతరం అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ‘మనం’ చిత్రంపై పొగడ్తలతో ముంచెత్తారు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, శ్రేయా సరన్, సమంతా లు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు గా వ్యవహరించారు.

