పెద్ది : రామ్ చరణ్ తనకు గర్వకారణమన్న మెగాస్టార్ చిరంజీవి

పెద్ది : రామ్ చరణ్ తనకు గర్వకారణమన్న మెగాస్టార్ చిరంజీవి

Published on Jun 13, 2026 8:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. బుచ్చిబాబా సానా డైరెక్ట్ చేసిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సాధించిన సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా ‘పెద్ది’ టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో, ఆయన వారికి అభినందనలు తెలిపారు. తన కుమారుడి ఎదుగుదల, సినిమా పట్ల ఉన్న పట్టుదలను చూసి ఒక తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెద్ది టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు.

‘చరణ్ నాకు గర్వకారణం.. పుత్రోత్సాహం అంటే ఏంటో అనుభవపూర్వకంగా ఇప్పుడు నాకు తెలుస్తోంది. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సన్’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.మెగాస్టార్ స్వయంగా ఈ రేంజ్ ప్రశంసలు కురిపించడంతో మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు