
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గత కొద్దిరోజుల క్రితం సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్‌ను ఏప్రిల్ నెలలో హైద్రాబాద్‌లో నిరాటంకంగా జరపనున్నట్లు టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్ ఈనెల 7న హైద్రాబాద్‌లో మొదలుకానున్నట్లు టీమ్ తెలిపింది.
రామ్ చరణ్ ఈ షెడ్యూల్‌లోనే జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7నుంచి దాదాపు నెలరోజులు అన్నపూర్ణ స్టూడియోతో పాటు హైద్రాబాద్‍లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘తని ఒరువన్’లో విలన్ పాత్ర చేసి మెప్పించిన అరవింద్ స్వామి, తెలుగులోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హిపాప్ తమిజా, అశిమ్ మిశ్రా లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు రక్షక్, ధృవ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.