మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రమే “పెద్ది”. ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చరణ్ కెరీర్ లో ఇప్పుడు రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సోలోగా అయితే తన కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 400 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది. ఇప్పుడు వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 9 రోజుల రన్ ని పెద్ది గాడు బాక్సాఫీస్ దగ్గర పూర్తి చేసుకున్నాడు.
మరి ఈ 9 రోజుల్లో 366 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు మేకర్స్ ఇపుడు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనితో పెద్ది నెక్స్ట్ స్టాప్ డెఫినెట్ గా 400 కోట్ల క్లబ్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ వీకెండ్ బుకింగ్స్ బలంగా ఉన్నాయి. సో వీకెండ్ పూర్తయ్యే సరికి ఆ మార్క్ ని సినిమా చేరుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యింది.


