నైజాంలో బిగ్గెస్ట్ మార్క్ అందుకున్న ‘పెద్ది’ వసూళ్లు!?

నైజాంలో బిగ్గెస్ట్ మార్క్ అందుకున్న ‘పెద్ది’ వసూళ్లు!?

Published on Jun 13, 2026 8:59 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకొని దుమ్ము లేపింది. ఆల్రెడీ 360 కోట్లకి పైగా రాబట్టిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది.

ఇలా నైజాం మార్కెట్ లో పెద్ది ఏకంగా 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో పెద్ది అక్కడ ఏ రేంజ్ లో రన్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. సో లాంగ్ రన్ లో ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్ తదితరులు నటించగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు