తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మరో రికార్డ్ మార్క్ షేర్ వసూళ్లు!

తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మరో రికార్డ్ మార్క్ షేర్ వసూళ్లు!

Published on Jun 16, 2026 5:32 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన మొదటిసారి నటించగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకుంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా ఎక్కువ వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి. అయితే కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే పెద్ది సినిమాకి ఏకంగా 150 కోట్ల షేర్ మార్క్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇందులో ఏపీ నుంచే దాదాపు 100కోట్లకి పైగా షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే నైజాం మార్కెట్ లో 100 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేయనున్నట్టు కూడా టాక్. సో మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ది ప్రభంజనం మాములు లెవెల్లో లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే వృద్ది సినిమాస్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు