మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన అవైటెడ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని రీచ్ అయ్యింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి సోమవారం టెస్ట్ పాసయింది అని చెప్పవచ్చు. గత 24 గంటలలో బుక్ మై షోలో లక్ష 70 వేలకి పైగా టికెట్స్ సేల్ చేసుకుంది. ఇది స్ట్రాంగ్ నెంబర్ అనే చెప్పవచ్చు.
పైగా ఇంకా ఉన్న ఆ భారీ టికెట్ ధరలతో అంటే ఇంకా ఎక్కువే అన్ని చెప్పాలి. దాదాపు ఈరోజుకి అనేక పాన్ ఇండియా సినిమాల టికెట్ ధరలు నార్మల్ చేసేసారు. ఒకవేళ ఈ సినిమాకి కూడా తగ్గించి ఉంటే డెఫినెట్ గా ఈ సేల్స్ మరింత ఎక్కువ ఉండేవి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో టికెట్ ధరలు చూసి ఫ్యామిలీ తో వెళ్ళాలి అనుకునే వారు ఆగుతున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ టాక్. సో ఈ ఎఫెక్ట్ మాత్రం పడింది అనే చెప్పొచ్చు. వీటిని త్వరగా నార్మల్ చేస్తే మూమెంటం మరింత బాగుండే అవకాశం ఉంది.


