గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే, సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసేందుకు మరికొంత సమయం తీసుకోనున్నాడట. చరణ్ మూవీ కోసం ఆయన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. దీంతో చరణ్ ‘పెద్ది’ చిత్ర షూటింగ్ ముగించుకుని, ఆ వెంటనే ఓ సినిమాను చేయాలని భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చరణ్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు.
దీంతో సుకుమార్ కంటే ముందు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ను ఫిక్స్ చేయాల్సి ఉందట. మరి నిజంగానే సుకుమార్‌తో మూవీ కంటే ముందు చరణ్ మరో సినిమాను చేస్తాడా లేడా అనేది చూడాలి.