అమ్మ, నాన్న, అభిమానులు గర్వపడే సినిమా ఇచ్చాడు సుకుమార్ – చరణ్


రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్లో వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ట్రైల్ర్ ను రిలీజే చేశారు యూనిట్. ప్రేక్షకులు, అభిమానుల నుండి ట్రైలర్ కు భారీ స్థాయి స్పందన లభిస్తోంది. ఆడియో కూడ బాగుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం గురించి చరణ్ మాట్లాడుతూ నాన్నగారికి ‘ఆపద్బాంధవుడు, ఖైదీ’ ఎలాగో నాకు ఈ సినిమా అలాంటిది అన్నారు.

అంతేగాక సుకుమార్ అమ్మ, నాన్న, అభిమానులు గర్వపడే సినిమా ఇచ్చాడని, ఈ చిత్రంతో తనపై తనకే గౌరవం పెరిగిందని, తప్పకుండా ‘రంగస్థలం’ అందరినీ అలరిస్తుందని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా చంద్రబోస్ అన్ని పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.