సైరా సెట్ అగ్నిప్రమాదం ఫై స్పందించిన రామ్ చరణ్ !

Published on May 3, 2019 4:00 pm IST

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం కోసం వేసిన సెట్ లో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు కానీ 2కోట్ల మేర ఆస్థి నష్టం వాటినట్లు సమాచారం. ఇక ఈ ఘటన ఫై చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేస్ బుక్ ద్వారా స్పందించారు.

దురదృష్టవ శాత్తు కోకాపేట లో సైరా కోసం వేసిన భారీ సెట్ లో ప్రమాదం జరిగిందని అదృష్టం బాగుండి ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. త్వరలోనే ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నాం అని చరణ్ తెలియజేశాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఈఏడాది ద్వితీయార్థం లో విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More