“RRR” లో ‘రామరాజు’ పర్ఫెక్ట్ షాట్ పై టెక్నీషియన్ ఇంట్రెస్టింగ్ రిప్లై!

“RRR” లో ‘రామరాజు’ పర్ఫెక్ట్ షాట్ పై టెక్నీషియన్ ఇంట్రెస్టింగ్ రిప్లై!

Published on Apr 13, 2022 5:01 PM IST


మన టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ ఎవర్ విజువల్ మరియు యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్ లోనే ఒక బెస్ట్ వర్క్ గా ఇద్దరు స్టార్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తో చేసిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో మాత్రం రాజమోళి గత సినిమాల కంటే బెటర్ వి ఎఫ్ ఎక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లని చూపించారు. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి ఒక పర్ఫెక్ట్ షాట్ అంటూ ఇంటర్నేషనల్ ట్విట్టర్ హ్యాండిల్ వారు RRR క్లైమాక్స్ లో రామ్ చరణ్ అల్లూరి గా చేసిన ఓ షాట్ అందరినీ ఆకర్షించింది.

మరి దీనిపై వారు ఒక పర్ఫెక్ట్ షాట్ గా గుర్తించి ట్వీట్ చెయ్యగా ఇది సర్వత్రా వైరల్ గా మారింది. అయితే అసలు ఆ షాట్ వెనుక ఎంతమంది హార్డ్ వర్క్ ఉందో ఈ సినిమా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస మోహన్ తెలిపారు. ముందుగా వన్ పర్ఫెక్ట్ షాట్ వారికి ధన్యవాదాలు తెలిపి ఆ షాట్ కి విజన్ దర్శకుడు రాజమౌళి ది కాగా దానిని అంతే అద్భుతంగా సెంథిల్ కుమార్ తన కెమెరా వర్క్ తో చూపించారని..

అలాగే దానిని మరింత ఎలివేట్ చేస్తూ కీరవాణి దారి రామం రాఘవం సాంగ్ నన్ను కూడా ఎంతో విస్మయానికి లోను చేసింది అని తెలిపారు. అలాగే ఫైనల్ గా ఈ సీక్వెన్స్ కి వి ఎఫ్ ఎక్స్ వర్క్ అందించిన మకుట విఎఫ్ఎక్స్ వారికి మరియు ఆ టీమ్ ని లీడ్ చేసిన పీట్ డ్రాపర్ కి అభినందనలు తెలియజేస్తున్నాని తెలిపారు. అలాగే ఒరిజినల్ షాట్ ని కూడా పెట్టగా అది వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు