చరణ్ వినయవిధేయ రామ అరుదైన ఫీట్…!

చరణ్ వినయవిధేయ రామ అరుదైన ఫీట్…!

Published on Nov 28, 2019 12:18 PM IST

Vinaya Vidheya Rama

రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. హై వోల్టేజ్ యాక్టన్ సన్నివేశాలతో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినా, ఆశించిన విజయం సాధించలేక పోయింది. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఐతే టెలివిజన్ ప్రసారాలలో మాత్రం ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం.

ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న స్టార్ మా గత నెల13న సాయంత్రం ప్రసారం చేయగా 8.1 టీఆర్పీ దక్కించుకుంది. ఐతే రెండవ సారి మధ్యాహ్నం ఈనెల 17న ప్రసారమైన ఈ చిత్రం ఆశ్చర్యకరంగా ఫస్ట్ స్లాట్ కి మించి 8.2 రేటింగ్ దక్కించుకొని అందరికి షాక్ ఇచ్చింది. కొన్ని సినిమాలలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఇష్టపడక పోవడం వలన నష్టాలతో ముగుస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు