‘ఆచార్య’ కోసం చరణ్ ప్రయత్నం ‘ఆర్ఆర్ఆర్’ ఇబ్బందుల్లో పెట్టదు కదా ??

Published on Sep 29, 2020 2:04 am IST


మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణను రీస్టార్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. కథలోని అతిథి పాత్రకు రామ్ చరణ్ అయితేనే బాగుంటుందని, అప్పుడే పాత్రకు న్యాయం జరుగుతుందని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ చరణ్ రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూట్ కూడ త్వరలోనే మొదలుకానుంది. దీంతో చెర్రీ డేట్స్ దొరకడం కష్టంగా మారింది. కానీ చిరు నేరుగా రంగంలోకి దిగి రాజమౌళితో చర్చలు జరపడంతో జక్కన్న తన షూట్ ప్లాన్స్ మార్చుకుని చెర్రీకి వీలు కల్పించారు. దీంతో ‘ఆచార్య’లో చరణ్ నటించడం ఖాయమైంది.

అయితే ఇక్కడ మరో పెద్ద మార్పు కూడ ఉంది. అదే చరణ్ లుక్. రాజమౌళి సినిమా కోసం చరణ్ బాడీ బిల్డ్ చేసి సరికొత్తగా తయారయ్యారు. టీజర్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇదంతా జక్కన్న క్రెడిట్. అయనే చరణ్ ను అలా తయారవమని అన్నారు. ఇప్పుడు ‘ఆచార్య’ కోసం ఈ లుక్ లో మార్పులు జరుగుతున్నాయట. కథలో చరణ్ పాత్రను టైలర్ మేడ్ తరహాలో రాసుకున్నారట కొరటాల. కాబట్టి చరణ్ తన లుక్ మార్చుకోక తప్పట్లేదట. ఈ సంగతి కూడ రాజమౌళికి తెలుసు. చరణ్ మళ్లీ తన పాత లుక్ తెచ్చుకోగలడని నమ్మే ఆయన ‘ఆచార్య’లో నటించడానికి అనుమతి ఇచ్చారట. కనుక లుక్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చరణ్ ‘ఆచార్య’ షూట్ ముగియగానే అల్లూరి సీతారామరాజు లుక్ లోకి వెంటనే మారిపోవాలి. ఏమాత్రం జాప్యం జరిగినా మళ్లీ రాజమౌళి ఇబ్బందుల్లో పడతారు మరి. అయితే ఎప్పుడూ వర్కవుట్స్ చేస్తూ, పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ దేహాన్ని పూర్తి అదుపులో ఉంచుకునే చెర్రీకి ఈ చిన్నపాటి మార్పులు చూపడం పెద్ద కష్టమేమీ కాదు.

సంబంధిత సమాచారం :

More