మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇక ఈ కాంబోలో మరోసారి RC17 అనే చిత్రం తెరకెక్కనుండటంతో ఈ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం సుకుమార్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అటు రామ్ చరణ్ తన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు లభించిన రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడ్డ రామ్ చరణ్ ఇప్పుడు ఓ లాంగ్ బ్రేక్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాడట.
రామ్ చరణ్‌కు పెద్ది షూటింగ్ సమయంలో కొన్ని గాయాలు కావడంతో, వాటికి సంబంధించి చిన్న సర్జరీ జరగనుందట. ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోనున్నాడు. దీంతో సుకుమార్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. RC17 జనవరి 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ లెక్కన 2027లో రామ్ చరణ్ సినిమా థియేటర్లలో కనిపించడం అసాధ్యమని తెలుస్తోంది. మరి సుకుమార్ ఈసారి రామ్ చరణ్‌ను ఎలాంటి పాత్రలో చూపెడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


