“చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!

“చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!

Published on Mar 27, 2024 7:01 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా రంగస్థలం (Rangasthalam). రామ్ చరణ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. ఈ చిత్రం లో చిట్టి బాబు రోల్ తో, తన మేకోవర్ కి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన పలు గెటప్స్ కి సంబందించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

ఈ చిత్రం లో చిట్టి బాబు లుక్ టెస్ట్ కోసం చాలా గెటప్స్ ట్రై చేశాడు. అందులో చివరగా మాస్ అప్పీల్ ఉన్న లుక్ ను సెలెక్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రం లో రామ్ చరణ్ కి స్టైలింగ్ సుష్మిత కొణిదెల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్, రామ్ చరణ్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో RC17 తెరకెక్కనుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు