‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారట..!

‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారట..!

Published on Jan 13, 2026 12:10 AM IST

rc msg

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’( Mana Shankara Vara Prasad Garu) జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఆయన వింటేజ్ సినిమాల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తన తండ్రి చిరంజీవి నటించిన ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో వీక్షించారు. సినిమా మొత్తాన్ని ఎంతో ఆసక్తిగా ఆస్వాదించిన రామ్ చరణ్, చిరంజీవి పెర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ పవర్‌ఫుల్ క్యామియోలో కనిపించగా, నయనతార హీరోయిన్‌గా నటించింది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలో కేథరిన్ తెరెసా, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు