2 రోజులు వెనక్కి వెళ్ళిన ‘బ్రూస్ లీ’ తమిళ్ ఆడియో

2 రోజులు వెనక్కి వెళ్ళిన ‘బ్రూస్ లీ’ తమిళ్ ఆడియో

Published on Oct 7, 2015 3:15 PM IST

bruce-lee-the-fighter
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘బ్రూస్ లీ’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. అనుకున్న టైంకి సినిమాని ప్రేక్షకులకు అందించాలని ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తున్న విషయాన్ని ఇది వరకే తెలియజేశాం. దరసరా కానుకగా అక్టోబర్ 16న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ‘బ్రూస్ లీ 2’ పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ చిత్ర టీం తమిళ ఆడియోని 7 రిలీజ్ చేయనున్నారని తెలిపారు. కానీ తాజాగా తమిళ ఆడియోని రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ కానుంది.

తాజా సమాచారం ప్రకారం ‘బ్రూస్ లీ 2’ ఆడియోని అక్టోబర్ 9న చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. మరో రెండు రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది, షూటింగ్ మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు, సినిమా షూట్ మొత్తాన్ని ఫినిష్ చేసాక తమిళ ఆడియో రిలీజ్ చెయ్యాలనుకొని అక్టోబర్ 9కి వాయిదా వేసారు. డిస్ట్రిబ్యూటర్ భద్రకాళి ఫిల్మ్స్ అధినేత భద్రకాళి ప్రసాద్ తమిళ్ లో గ్రాండ్ గానే ఆడియో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఓ ప్రముఖ తమిళ హీరో కూడా ఈ ఆడియో లాంచ్ కి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తన మార్క్ కామెడీతో పాటు, సూపర్బ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, రావు రమేష్, అరుణ్ విజయ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు