వైరల్ అవుతోన్న చరణ్ – సానియా డాన్స్ వీడియో !

Published on Dec 14, 2019 7:35 pm IST

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహాం టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ తో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే కేవలం దగ్గరి బంధువులను సన్నిహితులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ భార్య ఉపాసన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి మంచి స్నేహితురాలు. అందుకే వీరు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

కాగా తాజాగా ఈ వివాహానికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సానియా మీర్జా మరియు దర్శకురాలు ఫరా ఖాన్ లు డాన్స్ చేస్తున్నారు. మొత్తానికి చరణ్ చాల ఉల్లాసవంతంగా స్టెప్స్ వేస్తోన్న ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ బాగానే వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More