‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నిస్తే.. పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వర్మను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై వైయస్ జగన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.
ఇదా ప్రజాస్వామ్యం. చంద్రబాబు గారూ. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అని పోస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. కాగా తాజాగా జగన్ పోస్ట్ పై యామిని సాదినేని మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్ అని ఘాటుగా విమర్శించారు. అలాంటి సైకో డైరెక్టర్ కు జగన్ మోహన్ రెడ్డి మద్దతుగా ట్వీట్ చెయ్యడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. మరి తన పై ఘాటుగా విమర్శలు చేసిన యామిని పై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.


