ఆర్జీవీ ‘ల‌డ్‌కీ’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ పార్ట్ కేక..!

Published on Nov 8, 2021 4:00 pm IST

సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న మార్ష‌ల్ ఆర్ట్స్ చిత్రం “ల‌డ్‌కీ” ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్. పూజా భలేకర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇండో-చైనీస్ కో ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడ‌క్ష‌న్ మేజ‌ర్ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియాలోనే మొట్ట‌మొద‌టి మార్ష‌ల్ ఆర్ట్స్ సినిమాగా వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేడు వర్మ, చైనీస్ టీంతో క‌లిసి విడుద‌ల చేశాడు.

మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువ‌తిగా పూజా భ‌లేక‌ర్ యాక్ష‌న్ సన్నివేశాలతో పాటు అందాల ఆరబోతలో కూడా ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఆర్జీవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా హిందీతో పాటు చైనీస్ భాష‌లో విడుద‌ల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More