వర్మ సినిమా వివాదం పెద్దదయ్యేలా ఉందే !

వర్మ సినిమా వివాదం పెద్దదయ్యేలా ఉందే !

Published on Nov 25, 2020 12:09 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా మొదలైనప్పటి నుండి సినిమా చుట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. తమ అనుమతి లేకుండానే తమ కుమార్తె జీవితం గురించి సినిమా తీయటం పట్ల దిశ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

అంతేకాదు ఎన్ కౌంటర్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడ సినిమా మీద అభ్యంతరాలు చెబుతూ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతుండగానే తమ వారిని నిందితులుగా చూపించి మరింత వేదనకు గురిచేస్తున్నారని, సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. వీరి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం వాదనలను అనుమతించింది. ఎన్ ‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, చిత్రంలో నిందితులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, సంఘటనపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుపుతున్నప్పుడు చిత్రం ఎలా తీస్తారని, సినిమా విడుదల కాకుండా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు