మన టాలీవుడ్ యువ స్టార్ హీరోస్ లో టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మంచి కాన్సెప్ట్ అండ్ ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో రన్ తర్వాత ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఒరిజినల్ తెలుగు సహా డబ్బింగ్ భాషలు హిందీ, తమిళ్ ఇంకా కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా వచ్చింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా కన్నడ స్టార్ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర చేశారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


