మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మాస్ చిత్రం “స్కంద” రిలీజ్ పనుల్లో రామ్ అండ్ టీం బిజీగా ఉన్నారు. మరి రామ్ కి యూత్ లో అయితే సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
అందులో ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ చేసిన పని అయితే ఇప్పుడు రామ్ పోతినేని హృదయాన్ని తాకింది. మరి హరిహర అనే రామ్ అభిమాని తన కొడుకుకి పేరు పెట్టే కార్యక్రమంలో అయితే ఇప్పుడు రామ్ హీరోగా నటించిన “స్కంద” అనే పేరుని తన కొడుక్కి ఎంతో ప్రేమగా రామ్ మీద ఉన్న అభిమానంతో పెట్టుకున్నాడు.
దీనితో ఈ మేటర్ రామ్ దగ్గరకు వెళ్లగా రామ్ దీనికి రిప్లై ఇస్తూ ఇది నన్ను ఎంతగానో కదిలించింది అని ఆ భగవంతుడు స్కంద ఆశీస్సులు ఈ చిన్నారికి ఉండాలని మీకు కుటుంబాన్ని కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని రామ్ తెలిపాడు. దీనితో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అయితే వైరల్ గా మారింది.
I’m so touched..I’m sure the blessings of lord Skanda will always be with him.. God bless you & your family.. ❤️ https://t.co/66uYUZtwVc
— RAm POthineni (@ramsayz) September 16, 2023
