భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ఎనర్జిటిక్ స్టార్..!

Published on Jul 14, 2021 1:06 am IST

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని రెమ్యునరేషన్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో రామ్‌ తన 19వ సినిమాను చేస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా నిన్న సెట్స్‌పైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రామ్‌ తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసినట్టు ప్రచారం జరుగుతుంది.

అయితే మొన్నటి వరకు ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తీసుకునే రామ్‌ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు పెంచాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. లింగుస్వామితో చేస్తున్న సినిమాకి రామ్‌ 13 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రామ్‌ ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచడంతో ఇండస్ట్రీ వర్గాలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్‌ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :