రెడీ జోడి చాన్నాళ్లకు కలిశారుగా.

Published on Aug 6, 2019 8:37 am IST

బొమ్మరిల్లు హాసిని గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన జెనీలియా నిన్న 33వ పుట్టిన రోజు జరుపుకున్నారు. తెలుగు,తమిళ,హిందీ భాషలలో ఎక్కువగా కనిపించిన జెనీలియా 1987 ఆగస్టు 15న ముంబైలో జన్మించారు. 2003లో వచ్చిన “తుజే మేరీ కసమ్” హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన జెనీలియా తెలుగులో సత్యం,సాంబ,సై,నా అల్లుడు,హ్యాపీ,బొమ్మరిల్లు,ఢీ, రెడీ,ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించారు. దగ్గుబాటి రానాతో చేసిన ‘నా ఇష్టం’ ఈమెకు తెలుగులో చివరి చిత్రం. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్నాక ఆమె సినిమాలు చేయడం తగ్గించారు.

ఐతే హీరో రామ్, జెనీలియాను స్వయంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే జెనీలియా,రితేష్ తో కలిసిదిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి స్పెషల్ విషెస్ చెప్పారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో 2008లో వచ్చిన “రెడీ” చిత్రం ఘనవిజయం అందుకుంది. కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్,జెనీలియా నటనతో ఆకట్టుకోగా, దేవిశ్రీ మ్యూజిక్,కోనా వెంకట్ డైలాగ్స్,శ్రీను వైట్ల డైరెక్షన్ చిత్ర విజయానికి దోహదం చేశాయి. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :