రామ్ పోతినేని చేతుల మీదుగా నేడు సీటిమార్ ట్రైలర్ విడుదల!

Published on Aug 31, 2021 11:10 am IST

గోపీచంద్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం సీటిమార్. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, విడుదల అయిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఈ మేరకు నేడు ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం అయింది. ఉస్తాద్ రామ్ పోతినేనీ చేతుల మీదుగా సీటిమార్ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. నేడు మధ్యాహ్నం 2:53 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :