“రెడ్”తో హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్న రామ్.!

Published on Oct 25, 2020 9:44 am IST

తెలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రెడ్”. తన దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల చేత అనేక సినిమాల్లానే ఆగాల్సి వచ్చింది. అయితే ఓటిటి ఏలుతున్న కాలంలో కేవలం థియేట్రికల్ రిలీజ్ మాత్రమే చేస్తామని మేకర్స్ స్టిక్ అయ్యి ఉండి ఈరోజు దసరా సందర్భంగా ఒక థ్రిల్లింగ్ అప్డేట్ ఇవ్వనున్నామని తెలిపారు.

అలా అన్నట్టుగానే రామ్ ఆ అప్డేట్ ను రివీల్ చేసాడు. దీనితో తన హిస్టరీ రిపీట్ చేస్తానని సంకేతం ఇచ్చేసాడు. తన “రెడ్” చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉంచుతున్నామని తెలిపారు. ఇంతకు ముందు సంక్రాంతికి వచ్చిన “దేవదాసు”, “మస్కా” చిత్రాలు ఎలా హిట్టయ్యాయో ఈసారి “రెడ్” తో కూడా హిట్ కొట్టబోతున్నానని రామ్ చాలా నమ్మకంగా అనౌన్స్ చేశారు.

డేట్ ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు కానీ మొత్తానికి సంక్రాంతి రేస్ లో ఈ మాస్ మసాలా ఎంటెర్టైనర్ ను నిలపనున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి రామ్ తన సంక్రాంతి సాలిడ్ హిట్ హిస్టరీ రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More