రామ్ ఒప్పుకున్న సినిమాల్ని చేస్తాడా ?

Published on Jul 25, 2019 2:01 am IST

హీరో రామ్ చాన్నాళ్ల తరవాత ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఆయన కెరీర్లో ఇదే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఆయనకు మాస్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇక మీదట కూడా ఆయన ఇలాంటి కమర్షియల్ సినిమాలే చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రామ్ ఆలోచనలో పడ్డారు.

ఈ సినిమా విడుదలకు ముందు రామ్ రెండు మూడు కథల్ని ఓకే చేసి పెట్టుకున్నాడట. వాటి నుండే ఒక కథతో నెక్స్ట్ సినిమా చేయాలనుకున్నాడట. కానీ ఇప్పుడు ఆ కథల్ని చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడట. కారణం ఆయనకు కొత్తగా ఏర్పడిన మాస్ ఇమేజ్. ఇంత మాస్ ఇమేజ్ నడుమ ఆ కథలని చేస్తే వర్కవుట్ అవుతుందా అనే సందేహంలో ఉన్నారట ఆయన. మరి చూడాలి రామ్ ముందుగా అనుకున్న కథనే చేస్తాడో లేకపోతే కొత్త కథని చూజ్ చేసుకుంటాడో.

సంబంధిత సమాచారం :