నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు – రామ జోగయ్య శాస్త్రి

Published on Sep 3, 2021 11:41 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సెప్టెంబర్ 2 వ తేదీన ఉదయం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ పాట టాలీవుడ్ లో నే రికార్డ్ లు సృష్టిస్తుంటే, కొందరు మాత్రం పాట పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. కొందరు పాట బాగోలేదు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అందుకు రామ జోగయ్య శాస్త్రి గారు నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :