‘వివిఆర్’ నుండి రేపు ‘రామ లప్స్ సీత’ ప్రోమో !

Published on Jan 5, 2019 12:32 pm IST

‘రంగస్థలం’తో భారీ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి కానుకగా జనవరి 11న ‘వినయ విధేయ రామ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం నుండి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ‘రామ లప్స్ సీత’ వీడియో సాంగ్ ప్రోమో విడుదలకు సిద్దమవుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా వివేక్ ఒబేరాయి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More