“వకీల్ సాబ్” సత్యమేవ జయతే చిరు విన్నారట.!

Published on Mar 5, 2021 5:10 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు శ్రీరామ్ వేణు గట్టి మార్పులనే చేసి రెడీ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”ను లేటెస్ట్ గా విడుదల చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ అవుట్ స్టాండింగ్ సాంగ్ ను ఈ పాటను రాసిన సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి మెగా బ్రదర్ మెగాస్టార్ చిరంజీవికి కూడా వినిపించినట్టుగా తెలిపారు. ఈ ఆనంద సమయంలో ఓ ట్వీట్ ను కూడా పెట్టారు. “నిండుగా నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుని….సమక్షంలో…సత్యమేవజయతే వినిపించాను…పండగ రోజు…మనసున్న మారాజు మా కొణిదెల చిరంజీవి గారు” అంటూ తన వాత్సల్యాన్ని వ్యక్తం చేశారు. మరి ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న “ఆచార్య” షూట్ లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :