OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్న “రామారావు ఆన్ డ్యూటీ”

OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్న “రామారావు ఆన్ డ్యూటీ”

Published on Feb 27, 2022 5:51 PM IST


మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు, అందులో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ రచించి, దర్శకత్వం వహించిన ఈ ప్రత్యేకమైన థ్రిల్లర్‌ లో దివ్యాంశ కౌశిక్ మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సోనీ లైవ్ లో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. OTT ప్లాట్‌ఫారమ్ అధికారికంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో పోస్ట్ చేసింది.

అలాగే, సినిమా టీజర్‌ను మార్చి 1, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. నటుడు వేణు రామారావు ఆన్ డ్యూటీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ మరియు ఇతరులు కూడా ఉన్నారు. SLV సినిమాస్ మరియు RT టీమ్‌వర్క్స్‌ చే బ్యాంక్రోల్ చేయబడిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మార్చి 1న టీజర్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు