రవితేజ నాకు స్ఫూర్తి.. నాని క్రేజీ కామెంట్స్

Published on Jul 25, 2022 9:03 am IST

మాస్ మహారాజా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..“నేను గెస్ట్‌గా రాలేదు. రవి అన్న గురించి మాట్లాడడానికే వచ్చాను. రవి అన్నకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. మెగాస్టార్ ఆయనకు స్ఫూర్తి.

అలాగే రవి అన్న మాలాంటి ఎందరికో స్ఫూర్తి. ప్రతి తరానికి ఒకడు ఉంటాడు. రాబోయే నటీనటులందరికీ స్ఫూర్తిని ఇస్తుంటాడు. ఇక మెగాస్టార్ క్యారవాన్‌లోకి రవి అన్న వచ్చే సీన్ నేను చూశాను. నేను కూడా ఏదో ఒక రోజు రవి అన్న కారవాన్‌లోకి అడుగుపెట్టాలని నేను ఆశిస్తున్నాను, ఇది త్వరలోనే జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి రవి అన్న అందించిన సహకారం ప్రశంసనీయం. 20 ఏళ్లుగా ఆయన అం డ్యూటీలోనే ఉన్నారు’ అంటూ నాని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :