రేర్ ఫీట్ సాధించిన రామ్ సినిమా

Published on Dec 10, 2019 8:03 pm IST

ఇటీవల మన తెలుగు సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. తెలుగు సినిమాలని యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో వెతుక్కుని మరీ చూసుకుంటున్నారు. అందుకే కొన్ని యూట్యూబ్ సంస్థలు తెలుగు సినిమాల్ని హిందీలో డబ్ చేసి హిందీ ప్రేక్షకులకు అందిస్తున్నాయి. అలా డబ్ అయిన చిత్రమే రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో డీసెంట్ హిట్ అయింది. దీన్ని హిందీలోకి ‘ధూమ్ ధార్ ఖిలాడీ’గా డబ్ చేశారు.

ఈ హిందీ వెర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. సుమారు 141 మిలియన్ల వ్యూస్, మిలియన్ లైక్స్ సాధించింది. ఇలా మిలియన్ లైక్స్ దక్కించుకున్న తొలి దక్షిణాది సినిమాగా కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా రామ్‌ ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరి పిచ్చి ప్రేమకు థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇకపోతే ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘రెడ్’ అనే సినిమాను చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More