
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. రామ్ నటిస్తున్న ‘శివం’, ‘హరికథ’ సినిమాలు సెట్స్ పై ఉంటే, ‘పండగ చేస్కో’ సినిమాకి షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇటీవలే ఈ చిత్ర టీం యూరప్ లో సాంగ్స్ షూట్ చేసుకొని రావడంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర టీం మిగిలిన్ ఉన్న ప్యాచ్ వర్క్ సీన్స్ నిహైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆ ప్యాచ్ వర్క్ సీన్స్ ని కూడా ఫినిష్ చేసి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేయనున్నారని ఈ చిత్ర టీం తెలిపింది.
సినిమా షూటింగ్ చివరికి చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ హరికథ షూటింగ్ లో భాగంగా పొల్లాచ్చిలో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే పండగ చేస్కోకి డబ్బింగ్ చెబుతాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియోని ఈ నెలాఖరులోగా రిలీజ్ చేసి మే 14న సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.