తెలుగు రాష్ట్రాల్లో “రెడ్” మూడో రోజు వసూళ్లు ఇవే.!

Published on Jan 17, 2021 2:14 pm IST

ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన సాలిడ్ చిత్రాల్లో ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “రెడ్” కూడా ఒకటి. మంచి అంచనాలతో విడుదల కాబడిన ఈ చిత్రానికి కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.

అంతే కాకుండా టాక్ కాస్త అటు ఇటు గా వచ్చినా కూడా తర్వాత రోజుల్లోనూ ఈ చిత్రానికి డీసెంట్ హోల్డ్ దక్కింది. మరి అలా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడో రోజు వసూళ్ల వివరాలు పీఆర్ లు వెల్లడించారు. మరి ఆ సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడో రోజు 2.71 కోట్ల షేర్ ను రాబట్టి స్టడీగా నిలిచింది. మరి ఈ చిత్రానికి మూడో రోజు ఏయే ఏరియాల్లో వసూళ్లు ఎలా వచ్చాయో ఓ లుక్కేస్తే..

నైజాం: రూ .97 లక్షలు
సీడెడ్: రూ .43 లక్షలు
ఉత్తరాంధ్రా: రూ .37 లక్షలు
తూర్పు గోదావరి: రూ .28 లక్షలు
పశ్చిమ గోదావరి: రూ .17 లక్షలు
గుంటూరు: రూ .18 లక్షలు
కృష్ణ: రూ .28 లక్షలు
నెల్లూరు: రూ .8 లక్షలు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో డే 3 షేర్ – రూ .2.71 కోట్లు రాగా 5.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా స్రవంతి రవికిషోర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More