‘శైలజా రెడ్డి అల్లుడు’ షూటింగ్ ను పూర్తి చేసిన రమ్య కృష్ణ !

‘శైలజా రెడ్డి అల్లుడు’ షూటింగ్ ను పూర్తి చేసిన రమ్య కృష్ణ !

Published on Jul 18, 2018 7:09 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య, అనుఇమ్మాన్యుయేల్ జంటగా ప్రముఖ దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజా రెడ్డి పాత్రలో నటిస్తుంది. ఈరోజు ఆమె ఈ చిత్రానికి సంభంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు రానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు