హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కాబోతుంది బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’. కాగా ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథ, కథనం, నటుడు ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. అయితే టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించబోతుందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఫిల్మ్ సర్కిల్స్ లో తాజా టాక్ ఏమిటంటే, రమ్యకృష్ణ ఈ చిత్రానికి ఇంకా సైన్ చేయలేదు. ఈ చిత్రంలో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట. రమ్య కృష్ణది ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో రమ్యకృష్ణ భారీగా రెమ్యునిరేషన్ అడుగుతుందట.
ఇక నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలను చేస్తున్నారు.


