ఆ రోల్స్ కు ఆమె మెయిన్ ఆప్షన్ !

ఆ రోల్స్ కు ఆమె మెయిన్ ఆప్షన్ !

Published on Mar 3, 2020 8:07 AM IST

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న సెకండ్ మూవీ ‘రొమాంటిక్’. కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లిగా నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించి అలరించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది. ఏమైనా ఇలాంటి అత్త పాత్రలకు రమ్యకృష్ణనే మెయిన్ అప్షన్ గా మారిపోయింది.

ఇక కొత్త దర్శకుడు అనిల్ పాదూరి డైరెక్షన్ లో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి లిరికల్ వీడియో సాంగ్ దాకా బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని గట్టిగా కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో ఈ సినిమా సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ సాంగ్ సినిమా పై అంచనాలను బాగా పెంచాయి. ఇక ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో జరిగే ఓ లవ్ స్టోరీగా తెరకెక్కనుందట. మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరికి సూపర్ హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌ అండ్ ఛార్మి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు