మా సినిమా ఆగిపోలేదు.. బాహుబలి కంటే గొప్పగా తీస్తాం – రానా

Published on Dec 12, 2019 8:22 pm IST

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో పలు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయనుండగా రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా రానా ఇండియాలో లేకపోవడతో సినిమా ఆగిపోయిందనే రూమర్లు మొదలయ్యాయి. కానీ అవేవీ నిజం కాదని రానా అంటున్నారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి సినిమాను రూపొందిస్తుండటం వలనే ప్రాజెక్ట్ టైమ్ తీసుకుంటోందట.

సినిమా విజువల్స్ పరంగా గొప్పగా ఉండటం కోసం వర్చువల్ రియాలిటీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, దీనికోసం మెడికల్ టెక్నాలజీలో ఉత్తమమైన త్రీడీ స్కానింగ్ కంపెనీతో కలిసి వర్క్ చేస్తున్నట్టు రానా తెలిపారు. అంతేకాదు తమ సినిమాను ‘బాహుబలి’ కంటే గొప్పగా ఉండేలా రూపొందించాలని భావిస్తున్నామని, 2020 చివరికి సినిమా సెట్స్ మీదికి వెళుతుందని చెపుకొచ్చారు. మొత్తానికి రానా ఇచ్చిన క్లారిటీతో ప్రాజెక్ట్ ఆగిపోలేదని కన్ఫర్మ్ అయింది. పురాణగాథల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు రూ.180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More