స్టార్ హీరో కాదు..స్టార్ యాక్టర్..!

స్టార్ హీరో కాదు..స్టార్ యాక్టర్..!

Published on Apr 22, 2020 10:00 PM IST

హీరోగా రానా దగ్గుబాటిది టాలీవుడ్ లో పదేళ్ల ప్రస్థానం. పదేళ్లంటే చెప్పుకొనేంత పెద్ద సినీ జర్నీ ఏమి కాదు. ఐతే ఈ పదేళ్లలో రానా సాధించిన విజయాలు, ఎంచుకున్న పాత్రలు ఆయనకు అంత పేరు తీసుకువచ్చాయి. స్టార్ హీరో హోదా రాకపోయినా స్టార్ యాక్టర్ గా ఆయన అన్ని పరిశ్రమలకు సుపరిచితుడే. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా రానాకు విశేష గుర్తింపు ఉంది. స్టార్ హీరోలకు కూడా సొంతం కానీ పాన్ ఇండియా ఇమేజ్ రానా సొంతం చేసుకున్నారు.

2010 లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్ తో వెండితెరకు పరిచయం అయ్యాడు రానా. సాధారణంగా డెబ్యూ హీరో అంటే లవ్, కమర్షియల్ సినిమాలు ఎంచుకున్నారు. దశాబ్దాల సినీ అనుభవం కలిగిన సురేష్ బాబు తన కుమారుడిని భిన్నమైన సబ్జెక్టుతో ప్రారంభించారు. హీరోగా రానాను లాంచింగ్ సినిమా వేడుకకు హాజరైన చిరంజీవి ఇంత మంది సపోర్ట్ ఉన్నా, నీలో ఏముందని అనేదే జనాలకు కావలసింది, బ్యాక్ గ్రౌండ్ ఉండడం వలన ఎదగలేం అని పరోక్షంగా చెప్పారు. మరి ఆ మాటలు రానాకు స్ఫూర్తిని ఇచ్చాయేమో గాని రానా హార్డ్ వర్క్ తో తనని తానూ మార్చుకున్నాడు, మంచి నటుడిగా ఎదిగాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు