బిగ్‌బాస్-5కి హోస్ట్‌గా చేయలేనన్న రానా?

Published on Jul 9, 2021 12:50 am IST


తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టబోతుంది. కరోనా కారణంగా ఆలస్యమవుతున్న ఈ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి సీజన్‌కు హోస్ట్‌గా దగ్గుబాటి రానా రాబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సారి హోస్ట్‌గా చేయలేనని నాగ్ చెప్పడంతో నిర్వాహకులు రానాను సంప్రదించినట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా వినిపిస్తున్న అలికిడి ఏంటంటే రానా కూడా ఈ సీజన్‌కు హోస్ట్‌గా చేసేందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా ఈ షో చేయలేనని, అంతేకాకుండా బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో చేయడం అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్నదని భావించి రానా హోస్ట్‌గా చేయలేనని చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హోస్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :