రానా అమెరికా ప్రయాణం వెనుక కారణం అది…!

Published on Aug 6, 2019 10:17 pm IST

రానా దగ్గుబాటి ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అమెరికా ప్రయాణం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి పుకార్లతో విసిగిపోయిన రానా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు తన అమెరికా ప్రయాణం వెనుక గల అసలు కారణాలు వెల్లడించడం జరిగింది. దర్శకుడు గుణ శేఖర్ కొద్దినెలల క్రితం రానా తో “హిరణ్యకశిప” అనే భారీ పౌరాణిక చిత్రం చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రొడక్షన్ మొదలుకానున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల విషయమై రానా అమెరికా వెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “హిరణ్యకశిప”మూవీ విజువల్ ఎఫెక్ట్స్,అలాగే మేక్ అప్ తదితర అంశాలకు సంబంధించిన నిపుణులతో రానా చర్చలు జరపడానికే అమెరికా వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం రానా “హాథీ మేరీ సాథీ” అనే హిందీ చిత్రంతో పాటు, సాయి పల్లవి జంటగా “విరాట పర్వం”,అక్షయ్ కుమార్ తో పాటు “హౌస్ ఫుల్ 4” చిత్రాలలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :