‘బెంగళూరు డేస్’ కోసం చెన్నైకి రానా!

rana2
హీరో రానా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన రానా, తాజాగా ఓ తమిళ సినిమాలో హీరోగా నటించనున్నారు. మళయాలంలో ఘనవిజయం సాధించిన ‘బెంగుళూరు డేస్’ తమిళ రీమేక్‌లో రానా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. శ్రీదివ్య, ఆర్య, బాబీ తదితరులు రానాతో పాటు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నేటి నుండి మొదలుకానుంది. ఇక ఈ షూటింగ్ కోసం రానా ఇప్పటీకే చెన్నై చేరుకున్నారు. ఈ సంవత్సరం రానా నటించిన ‘బేబీ'(హిందీ) ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించగా, బాహుబలి పార్ట్1, రుద్రమదేవి సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి.

Exit mobile version