పవన్ పై రానా వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jul 28, 2021 4:15 pm IST


మన టాలీవుడ్ నుంచి మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం రావడానికి సిద్ధంగా ఉంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం. అయ్యప్పణం కోషియం కు రీమేక్ గా దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంతకంతకు హైప్ పెరుగుతూ వస్తుంది.

మరి రీసెంట్ గానే ఈ చిత్రం షూట్ ను రీస్టార్ట్ చేసుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు గ్యాప్ లేకుండా షూట్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో పవన్ తో పాటు షూట్ లో పాల్గొన్న రానా లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ పై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

పవన్ సెట్స్ లోకి రావడమే చాలా అనుభవంతో వస్తారని సినిమాపై ఆయనకు చాలా జ్ఞ్యానం ఉందని పవన్ సినిమాని ఒక కొత్త కోణంలో చూస్తారని అందుకే ఫస్ట్ టైం ఎక్స్ పీరియన్స్ చాలా కొత్తగా చాలా గౌరవంగానూ గొప్ప అనుభవంగా తనకి అనిపిస్తుందని తెలిపాడు.

అలాగే పవన్ మాట్లాడిన ప్రతీసారి కూడా సరికొత్త విషయాలు సినిమా కోసం నేర్చుకుంటున్నాని రానా తెలిపాడు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.

సంబంధిత సమాచారం :