చంద్రబాబు కోసం ‘రానా’ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడుగా !

Published on Feb 20, 2019 8:19 pm IST

మొత్తానికి ‘మహానాయకుడు’ మరో నలభై గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం రానాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో చంద్రబాబు పాత్రలో నటించడానికి రానా తీసుకున్న జాగ్రత్తలను చూపించారు. చంద్రబాబు ఆహార్యం దగ్గరనుండి ఆయన నడక వరకూ చంద్రబాబును గుర్తుచేసేలా రానా నటించాడు.

ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫై ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారు.

కాగా కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :