యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలిగా, రానా దగ్గుబాటి భళ్లాల దేవుడుగా కనిపించనున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్లో శరవేగంగా జరుగుతోంది. రానా యుద్ద భూమిలో తన శత్రు సైన్యంతో పోరాడే కొన్ని కీలక సన్నివేషాలను షూట్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని వేసారు. అలాగే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ఈ చిత్ర టీం డిజైన్ చేస్తోంది. అందుకే ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఈ చిత్ర టీం ఇంటర్నేషనల్ టీంతో గ్రాఫిక్స్ ని పూర్తి చేస్తోంది. అనుష్క – తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ భారీ బడ్జెట్ బాహుబలిని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


